కాంగ్రెస్‌ పార్టీ గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం

– రాష్ట్రాన్ని ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీ
– దాద్రా నగర్‌ హవేలీ పీసీసీ అధ్యక్షులు, సిడబ్ల్యుసి
– సభ్యులు మహేష్‌ శర్మ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ శ్రవణ్‌ కుమార్‌ రెడ్డి
నవతెలంగాణ- చేగుంట
కాంగ్రెస్‌ పార్టీ గ్యారంటీ పథకాలను ప్రతి గ్రామంలో ప్రజల వద్దకు తీసుకెళ్తామని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీ, చెప్పింది చేస్తాం, చేసేది చెబుతామని దాద్రా నగర్‌ హవేలీ పీసీసీ అధ్యక్షులు, సిడబ్ల్యుసి మెంబర్‌ మహేష్‌ శర్మ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ శ్రావణ్‌ కుమార్‌ రెడ్డిలు అన్నారు. చేగుంట మండలం వడియారం గ్రామంలో సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం శ్రావణ్‌ కుమార్‌ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గడపగడపకుకాంగ్రెస్‌ పార్టీ గ్యారంటీ కార్డు అందజేస్తామన్నారు. తుక్కుగూడ లో జరిగిన సభలో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, జాతీయ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఖర్గేలు ప్రకటించిన సంక్షేమ పథకాల గ్యారెంటీ కార్డులతో ప్రజలకు వద్దకు తీసుకువెళ్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా తాము కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఆకాంక్షించిన బంగారు తెలంగాణ నిర్మాణం కాంగ్రెస్‌ అభివద్ధి పథకా లతో, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలతోనే సాధ్యమవుతుం దన్నారు. దేశానికి రాష్ట్రానికి సుభిక్షమైన పాలనను అందిం చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనన్నారు. ప్రజలు రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలువనున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పెంటారెడ్డి, మాజీ సర్పంచులు శ్రీమాన్‌ రెడ్డి, రామ్‌ రెడ్డి ,నాయకులు విష్ణువర్ధన్‌ రెడ్డి, శ్రీధర్‌ రెడ్డి, బలరాం, యాదగిరి, కుమార్‌ ,రమేష్‌, తిరుమలేష్‌, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు శ్రీకాంత్‌, వడియారం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.