ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం

– షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి
– పెంజర్లలో ఎన్నికల ప్రచారం
– కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌, ఎంపీటీసీ
నవతెలంగాణ-కొత్తూరు
నిరుపేదలకు ప్రభుత్వం అందించిన భూము లను కాపాడి తిరిగి వారికి అందించి ఇందిరమ్మ రాజ్యం తీసుకువస్తామని షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మండలంలోని పెంజర్ల గ్రామంలో షాద్‌నగర్‌ నియోజకవర్గం అభ్యర్థి వీర్లపల్లి శంకర్‌తో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్‌ వసుంధరమ్మ, ఎంపీటీసీ దేశాల అంజమ్మ, వార్డు సభ్యులు, ఇతర బీఆర్‌ఎస్‌ నాయ కులు దేశాల రమేష్‌, నందిగామ సుధాకర్‌, ఉప సర్పంచ్‌ రమేష్‌, మాజీ ఉపసర్పంచ్‌ రమేష్‌తోపాటు ఇతర యువజన సంఘాలకు చెందిన యువకులు తదితరులు కలిసి కాంగ్రెస్‌లో చేరారు. వీరందరికీ ప్రతాప్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌లు కలిసి కండువా వేసి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాద్‌నగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ జెండా ఎగరేసేందుకు వీర్లపల్లి శంకర్‌ను బలపరిచి గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నానని అన్నారు. సౌమ్యుడైన వీర్లపల్లి శంకర్‌ను తమ బిడ్డ లాగా అక్కున చేర్చుకుని గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రజల కోసం పనిచేసే శంకర్‌ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని వివరించారు. శంకర్‌ గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శంకర్‌ మాటా ్లడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని విమ ర్శించారు. దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి, డబల్‌ బెడ్రూం ఇండ్లు, దళితబంధు ఇలా అనేక హామీలిచ్చి, ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు గొంగళ్ల హరినాథ్‌రెడ్డి, కేశంపేట జడ్పీటీసీ తాండ్ర విశాలా శ్రావణ్‌రెడ్డి, కొత్తూరు మాజీ సర్పంచ్‌ జండాగూడెం సుదర్శన్‌గౌడ్‌, మల్లాపూర్‌ సర్పంచ్‌ చిర్రా సాయిలు, మామిడి భీమ్‌రెడ్డి, సర్పంచ్‌ అంబటి ప్రభాకర్‌, నాయకులు ఎమ్మే సత్తయ్య, మామిడి రాజేందర్‌రెడ్డి, నవీన్‌ చారి, ఆగిరి రవికుమార్‌ గుప్తా, మామిడి సిద్ధార్థ రెడ్డి, దయాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.