నవతెలంగాణ – తొగుట
కాలువ సమస్యను ఉన్నతదికారుల దుష్టికి తీసు కెళ్తామని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుండి దుబ్బాక కాలువకు శనివారం నీరు విడుద ల చేసిన విషయం తెలిసింది. రైతుల కోరిక మేరకు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు కుడ్లేర్ వాగు చందా పూర్ చెక్డ్యాం నుండి జప్తి లింగారెడ్డిపల్లి తుంగ చెరువులోకి వెళ్లే సీసీ లైనింగ్ కాలువను స్థానిక ప్రజా ప్రతినిధు లతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కాల్వ గేటు వద్ద ఉన్న సమస్య పై అధికారులకు తెలియజేస్తా మన్నారు. ఈ విషయం రైతులు గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సిలివేరి మల్లారెడ్డిి, రైతులు బొడ్డు భూమయ్య తదితరులు ఉన్నారు.