బోనస్ కోసం పోరుబాట.. రైతు ఉద్యమం చేపడతాం

– బోనస్ అమలు చేయని పక్షంలో.. 6వ తేదీన నిరసన దీక్షలు చేపడతాం.
– కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్
నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
బోనస్ కోసం పోరుబాట రైతు ఉద్యమం చేపడతామని బోనస్ అమలు చేయని పక్షంలో ఆరవ తేదీన నిరసన అధ్యక్షులు చేపడుతామని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి కాసిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో సమర్పించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ..జిల్లా మొత్తంలో 2600వేల ఎకరాలకు పంట నష్టం వాటిల్లింది కావున… ఎకరానికి 25000 చొప్పున వెంటనే రైతులకు చెల్లించాలి  డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు  కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న  మద్దతు ధరపై క్వింటాల్కు బోనస్ గా అదనంగా రూ . 500/ ఇస్తామని హామీ ఇచ్చారు..  ఇప్పటివరకు దానిపై ఎలాంటి కార్యచరణ లేదు.. దీనిపై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు  కి వినతి పత్రం పార్లమెంట్ అభ్యర్థి శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ మరియు నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా . వీరితోపాటు జిల్లా పరిషత్ చైర్మన్ విట్టల్ రావు , మాజీ ఎమ్మెల్సీ వీజీ గంగాధర్ గౌడ్ , నగర మేయర్ నీతు కిరణ్ గారు, జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు, ధర్పల్లి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్  మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవ కెసిఆర్ ఆదేశాల మేరకు.. నేడు ప్రతి జిల్లాలో కొనసాగుతున్న వినతి పత్రంల అందజేస్తూ వరికి 500 బోనస్‌ ఎప్పుడిస్తరు? ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇస్తామన్న కాంగ్రెస్‌ హామీ అమలుకు నోచుకోవడం లేదు. ఓ వైపు యాసంగి ధాన్యం కొనుగోళ్లు మొదలైనా బోనస్‌పై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇస్తామన్న కాంగ్రెస్‌ హామీ అమలుకు నోచుకోవడం లేదు. ఓ వైపు యాసంగి ధాన్యం కొనుగోళ్లు మొదలైనా బోనస్‌పై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ఇప్పటికే తాగునీరు, సాగునీరు, కరువై పంటలు  జిల్లాలో 26000 వెయ్యి ఎకరాలు ఎండిపోతుంటే.. కనీసం బోనస్‌తోనైనా ఊరట లభిస్తుందనుకున్న రైతులకు నిరాశే మిగులుతున్నది. ప్రతి ఎకరానికి 25 వేల రూపాయలు చొప్పున ఎండిపోయిన పంటలకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు..ఎండిపోయిన పంటలకు అధికారంలోకి రాగానే ధాన్యానికి రూ. 500 బోనస్‌ ఇస్తామంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన కాంగ్రెస్‌ పార్టీ తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీపై నోరుమెదపడం లేదు. దీంతో రైతులు రూ. 500 బోనస్‌, మరియు రైతుబంధు, టైంకు రావలసిన రైతుబంధు  నిధులు ఎక్కడ కూడా సరైన సమయంలో అందడం లేదు… నేటి వరకు 5 ఎకరాలు ఉన్న రైతులకే చెల్లించారు, మిగతా వారి పరిస్థితి ఏంటి.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని దొంగ అబద్ధాలు దొంగ హామీలు ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ, వెంటనే మేనిఫెస్టో చెప్పిన ప్రకారం అమలు చేయకపోతే ఈనెల 6 తారీఖున రైతులతో కలిసి ఉద్యమంగా నిరసన దీక్షలు చేపడతాం అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ . మరియు నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా .  జిల్లా పరిషత్ చైర్మన్ విట్టల్ రావు మాజీ ఎమ్మెల్సీ వీజీ గంగాధర్ గౌడ్ , నగర మేయర్ నీతు కిరణ్ , జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు, ధర్పల్లి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్ , వివిధ మండలం నుండి, జడ్పిటిసిలు, ఎంపీపీలు, రైతు నాయకులు, బీఆర్ఎస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల నాయకులు  కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.