– టీవైజేఎఫ్ ఛాంబర్ కమిటీ చైర్మెన్ పీ.వీ ప్రభాకర్ రావు, రాష్ట్ర అధ్యక్షులు, డాక్టర్ తనుగుల జితేందర్ రావు
నవతెలంగాణ-ముషీరాబాద్
ప్రభుత్వంతో ప్రత్యేకంగా చర్చించి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని టీవైజేఎఫ్ ఛాంబర్ కమిటీ చైర్మెన్ పీ.వీ ప్రభాకర్ రావు, రాష్ట్ర అధ్యక్షులు, డాక్టర్ తనుగుల జితేందర్ రావు తెలిపారు. టీవైజేఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశానికి హాజరై పీవీ ప్రభాకర్ రావు మాట్లాడు తూ తన పలుకుబడి మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కషి చేస్తానన్నారు. అంతేకాకుండా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలతో పాటు అవకాశం ఉన్న దగ్గర డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధనకు కషి చేస్తానని తెలిపారు. టీవైజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, సీని యర్ జర్నలిస్ట్, డాక్టర్ తనుగుల జితేందర్ రావు అహర్నిశ లు, 24 గంటలు యూనియన్ జర్నలిస్టుల సమస్యలపై ఆలోచించే జితేందర్ రావు ఆలోచనలను ఆయన అభినం దించారు. రాష్ట్ర నాయకత్వానికి, జిల్లాల నాయకత్వాలకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా యూనియన్‌లో చేరిన జర్నలిస్టులకు అభినందనలు తెలిపారు. అనంతరం యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్టు, డాక్టర్ తనుగుల జితేందర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని వర్కింగ్ యూనియన్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో ముందు ఉంటామ న్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో తమ యూని యన్ ముందు వరసలో ఉంటుందని తెలిపారు. అక్రిడేషన్, నాన్‌అక్రిడేషన్ అనే తేడాలతో నూతనంగా జర్నలిజంలోకి వస్తున్న జర్నలిస్టులను నిరుత్సాహ పరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క జర్నలిస్టుని ఆదుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో టీవైజేఎఫ్ రాష్ట్ర నాయకులు, జిల్లాల నాయకులు, మహిళా జర్నలిస్టు సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.