– లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర్ సింగ్
నవతెలంగాణ-నెల్లికుదురు : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ బలరాం నాయక్ కు అవకాశం ఇవ్వండి అధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత లంబాడ హక్కుల పోరాట సమితి తీసుకుంటుందని ఆ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ సింగ్ అన్నారు మండల కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో ఎల్ హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర లతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలరాం నాయక్ గతంలో ఎంపీగా మరియు మాజీ కేంద్రమంత్రిగా పనిచేశాడని ఢిల్లీలో అందరితో పరిచయాలు ఎక్కువ ఉండి ఆ రోజుల్లో ఆయన కోట్లాది నిధులు తీసుకొచ్చి రోడ్లు వంతెనలు ఆదర్శ పాఠశాలలు కేంద్రీయ విశ్వవిద్యాలయాలను మరియు రైలను కేసముద్రం మహబూబాద్ రైల్వే స్టేషన్ లో ఆగుటకు అనుమతులను తీసుకొచ్చారని అన్నారు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని తో మంచి పరిచయాలు ఉన్న వ్యక్తి అని అన్నారు గతంలో ఎంపీగా మాజీ కేంద్రమంత్రి గా పనిచేసిన అనుభవం ఎంతో ఉందని అన్నారు ఈసారి బలరాం నాయక్ ఎంపీగా అవకాశం ఇస్తే అధిక మెజార్టీతో గెలిపించుకొని ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడేందుకు కృషి చేస్తామని అన్నారు గతంలో ఏ ఎంపీలు చేయని అభివృద్ధి పనులను కేవలం బలరాం నాయక చేశారని అన్నారు మరలా కూడా చేపిస్తామని అతను చేస్తాడని మా నమ్మకం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ మండల నాయకుడు లక్కీ యాకూబ్ గిరి వెంకన్న మౌనేందర్ సల్గు పూర్ణచందర్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు