వెంకట్రాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం

– మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్.

నవతెలంగాణ – రాయపోల్
మెదక్ ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని మెదక్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపిస్తామని మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ అన్నారు. గురువారం రాయపోల్ మండలం ఎల్కల్, బేగంపేట, దౌల్తాబాద్ మండలం అప్పాయి పల్లి గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలు హరిగోసపడుతున్నారని, 420 హామీలు, ఆరు గ్యారెంటీలంటూ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, ఏ ఒక్క హామీని కానీ ఏ ఒక్క గ్యారెంటీని కానీ పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రిని అని మర్చిపోయి బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఇప్పటి వరకు రైతులకు రైతు బంధులేదని, 24 గంటల కరెంటు లేదని, పంట పొలాలు ఎండిపోతున్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు విడుదల చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పాలన అంటేనే కరెంటు కష్టాలు, రైతుల గోసలు అని ప్రజలకు అర్థమైందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ మాత్రమే రక్షకుడని పేర్కొన్నారు. వెంకటరామిరెడ్డికి ఉమ్మడి మెదక్ జిల్లాతో ఎంతో అనుబంధం ఉందని సొంత నిధులతో 100 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటుచేసి ప్రజలకు సేవ చేస్తానని ప్రతి నియోజకవర్గంలో ఫంక్షన్ హాల్ నిర్మించి ఒక్క రూపాయికే అద్దెకిస్తానని ప్రజల కష్టసుఖాలలో ఎల్లప్పుడూ అండగా ఉండి ప్రజాసేవ చేయడానికి ఉన్నతమైన కలెక్టర్ పదవిని వదిలి రాజకీయాల్లోకి వచ్చాడని అలాంటి విద్యావంతుడిని గెలిపించుకొని మెదక్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకుందామన్నారు. కావున ప్రజలందరూ వెంకటరామిరెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్కల్ ఎంపీటీసీ వెంకటయ్య, మాజీ సర్పంచ్ లచ్చయ్య, యువజన విభాగం మండల అధ్యక్షులు స్వామి, సీనియర్ నాయకులు చింత కింది మంజూరు, నాయకులు జాల రాజయ్య, బిక్షపతి, సంఘం సురేష్, షాదుల్లా, సురేష్ తదితరులు పాల్గొన్నారు.