మాల కులస్తుల అభివృద్ధికి కృషి చేస్తాం

ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినరుభాస్కర్‌
నవతలెంగాణ-హనుమకొండ
మానుకులస్తుల అభివృద్ధికి కృషి చేస్తామని ప్రభుత్వ చీఫ్‌విప్‌, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినరుభాస్కర్‌ అన్నారు.ఆదివారం హనుమకొండ న్యూ శాయంపేట భీమ్‌ మాల పరస్పర సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ స్థల సేకరణ సంఘ భవన నిర్మాణానికి కృషి చేసిన వెంకట ముల్లు గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారికి ఘన నివాళులు అర్పించారు. వెయ్యి మంది సభ్యులు సంఘంలో భాగస్వామ్యం కాగానే తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.భీమ్‌ మాల సంఘం సంఘటితంగా ఉండాలని సహకార సంఘాలను ప్రోత్సహించడంలో నేనెప్పుడూ ముందుంటానని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం పొదుపు సహకార సంఘాలను ఏర్పాటు చేసుకుని వారి అభి వృద్ధికి దోహదపడుతున్నామని అన్నారు. ఆటో డ్రైవర్ల కోసం పొదుపు సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి తన వేతనం నుంచి నెలకు లక్ష రూపాయలను ఆరు నెలల పాటు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు రుణ విముక్తి కమిషన్‌ చైర్మన్‌ నగుర్ల వెంకటేశ్వర్లు మరియు మాల సంఘం నాయకులు పాల్గొన్నారు..