– పాఠశాల నిర్మాణానికి ఆర్థిక సాయం అందజేత
నవతెలంగాణ యాదగిరిగుట్ట రూరల్: సబ్బండవర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని మాసాయిపేట గ్రామపంచాయతీ మూడవ వార్డు నెంబర్ కళ్లెం విజయ జహంగీర్ గౌడ్ అన్నారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట శుక్రవారం, గ్రామంలోని మసీదులో ఉర్దూ పాఠశాల నిర్మాణం కోసం యాదగిరిగుట్ట మండల వైస్ ఎంపీపీ ననబోలు ప్రసన్న శ్రీనివాస్ రెడ్డి రూ.25 వేలు, గ్రామ పంచాయతీ మూడో వార్డు నెంబర్ కళ్లెం విజయ జహంగీర్ గౌడ్ రూ.15 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ మెంబర్ ఎండి యాకూబ్, కాంగ్రెస్ పార్టీ మండల మైనార్టీ అధ్యక్షులు యాకూబ్ అలీ, వార్డు మెంబర్లు సుంచు వినోద్ కుమార్, ఎండి ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.