
నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస విడిచే వరకు ఎర్రజెండా పక్షాన పోరాడిన బోడిసె సత్తయ్య ఆశయ సాధన కోసం కృషి చేస్తామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మండల శ్రీశైలం అన్నారు. బుధవారం ప్రధమ వర్ధంతి సందర్భంగా ఆయన స్తూపానికి పూలమాల ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ప్రజా అవసరాల కోసం ప్రజల హక్కుల సాధన కోసం జరిగిన అనేక ఉద్యమాలలో సత్తయ్య కీలక పాత్ర పోషించారు అని గుర్తు చేశారు. ఆయన పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకొని ప్రజల హక్కుల సాధన కోసం ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డోలు దెబ్బ వ్యవస్థాపకులు మాల్గా యాదయ్య, దొండ ఎంకన్న, బోడిసె నరసింహ, బోడిసె మహేందర్, శివ, బండారి మల్లేశం, బండారి బీరప్ప, అండాలు, కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.