పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కావడం హర్షణీయం అని ప్రధానోపాధ్యాయురాలు నాయి మా కౌసర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధవారం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలం లోని వెంకట్రావు పేట ఉన్నత పాఠశాలలో గతంలో ఇక్కడ పని చేసిన ఉపాధ్యాయులు ప్రభుత్వం బదిలీల ప్రక్రియ చేపట్టడం వల్ల ఇతర పాఠశాలల కు వెళ్లిపోయారని అన్నారు. ఇక్కడ కాళీగా ఉన్న పోస్టులలో సాంఘీక శాస్త్రం జి. మనోహర్, జీవ శాస్త్రం ఏ. సుధాకర్, తెలుగు ఎం. ఎల్లయ్య, హిందీ కి ఎం శంకర్, వ్యాయమ ఉపాద్యాయులుగా ఈ కనకయ్య విధులలో చేరారని తెలిపారు. ఈ మారుమూల గ్రామమైన తమ పాఠశాలలో విద్య ప్రమాణాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తది తరులు పాల్గొన్నారు.