అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తాం..

We will work hard to provide welfare schemes to all the deserving people.– మండల పరిషత్ అభివృద్ధి అధికారి మధుసూదన్ గౌడ్ 
నవతెలంగాణ – అచ్చంపేట
ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పేదరా సంక్షేమ పథకాలను హారులైన ప్రతి లబ్ధిదారునికి పథకం అందే విధంగా చర్యలు తీసుకుంటామని అచ్చంపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి మధుసూదన్ గౌడ్ అన్నారు. మంగళవారం అచ్చంపేట మండలంలోని  జోగ్య తాండ, గ్రామపంచాయతీలో  ప్రజాపాలన నిర్వహించిన గ్రామసభలో ఎంపీడీవో పాల్గొని మాట్లాడారు ఇందిరమ్మ ఆత్మీభరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు  ఇందిరమ్మ ఇండ్లు మంజూరీ చేయుట కు  అర్హులైన లబ్ధిదారులను గుర్తించమని తెలిపారు. ఈ సమావేశం లో గ్రామపంచాయతీ ప్రత్యేకాధికారి  లక్ష్మీపతి , హౌసింగ్ డీఈ ఆనంద్ రెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ రమేష్, ఏఈఓ పరమేష్ , జూనియర్ అసిస్టెంట్ ఆంజనేయులు, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీవాణి , పంచాయతీ కార్యదర్శి  శ్రీకాంత్ , గ్రామపెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.