మెదక్ ఎంపి స్థానం గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..

– కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి..
– ఉమ్మడి మెదక్ జిల్లా రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న శ్రీనివాస్ రెడ్డి..
– సీఎం. రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన చెరుకు..
నవతెలంగాణ – తొగుట
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు స్థానాలు గెలుపే లక్ష్యంగా పని చేస్తామని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్ లో పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే ఎజెండాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యం లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు ఎంపి స్థానాలు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని, నాయకులు కలిసి కట్టుగా పని చేయాలని సీఎం సూచించారని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గల ఎమ్మెల్యే లు,నియో జకవర్గ ఇంచార్జి లు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా బాధ్యత తీసుకోవాలని, వారి నియోజకవర్గాల అభివృద్ధికి కాల్లవల్సిన పనులను తన దృష్టికి తీసుకొని వస్తె పరిష్కరిస్తా నని హామీ ఇచ్చారని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ లను ఖచ్చితంగా అమలు చేస్తామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులే అయిందని, ఎన్నికల హామీలు అమలు చేయడం లేదని ప్రతిపక్షాలు విమర్శిం చడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రెండు హామీలను అమలు చేసిన ఘనత రేవంత్ రెడ్డి కే దక్కుతుం దన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, నిరుపేదలకు 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడం పట్ల ప్రతిపక్షాలు జీర్ణించుకోవ డం లేదన్నారు. అర్హులైన ప్రతి లబ్దదారులకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు.అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.