నవతెలంగాణ – గోవిందరావుపేట
ఎంపీటీసీలు అధికారులు అందరము ఒకరికొకరు సమన్వయంతో మండల అభివృద్ధి కొరకు పని చేయడం జరిగిందని మాజీ ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జి జేవహర్ రెడ్డి అధ్యక్షతన మాజీ ప్రజాప్రతినిధులైన ఎంపీపీ ఎంపీటీసీల కు వీడ్కోలు సందర్భంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వచ్చిన నిధులతో ఎక్కడ తక్కువ కాకుండా సమానత్వాన్ని పాటించి అభివృద్ధికి కృషి చేశామని అన్నారు. జడ్పిటిసి తుమ్మల హరిబాబు మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు అధికంగా నిధులను తీసుకువచ్చి మండల అభివృద్ధిలో పూర్తిస్థాయిలో భాగస్వామ్యం అయినామని అన్నారు. పలు శాఖల అధికారులు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు ఎంతో సమన్వయంతో పని చేశామని సర్వీసులు ఇంత సమన్వయంతో కొనసాగిన మండలం ఇదేనని అధికారులు ప్రశంసించారు. అభివృద్ధి కూడా అంచనాకు మించి జరిగిందన్నారు. అధికారులు మాజీ ప్రజా ప్రతినిధులు ఒకరినొకరు ఆత్మీయంగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. చివరలో అధికారులు ఎంపీటీసీలను ఎంపీపీని గౌరవంగా శాలువాలతో సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమం ఎంతో గౌరవంగా ఆడంబరంగా సంతోషంగా జరిగిందని దీనిని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరు కృషి చేశారని అందరి భాగస్వామ్ వల్లే ఈ కార్యక్రమం సక్సెస్ గా ముగించడం జరిగిందన్నారు ఎంపీడీవో జవహర్ రెడ్డి అన్నారు. చివరలో అధికారులకు మాజీ ప్రజాప్రతినిధులకు పలు రాజకీయ పార్టీల నాయకులకు విందు భోజనాలతో కృతజ్ఞతా భావంతో ముగింపు పలికారు.