– ఏఎస్‌ఐ సూర్య నారాయణ చారి
నవతెలంగాణ-దోమ
ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలనీ ఏఎస్‌ఐ సూర్య నారాయణ చారి అన్నారు. మంగళవారం దోమ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో వాహన దారులకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై, ఆన్‌లైన్ మోసలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వయసు నిండిన వారే విధిగా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాత వాహనాలు నడపాలన్నారు. వాహనాలకు ఉన్న పెండింగ్ చాలాన్లు ఉంటే వెంటనే మీ సేవ, ఆన్‌లైన్ సెంటర్ల ద్వారా చెల్లించుకోవచ్చు అన్నారు. స్మార్ట్ ఫోన్లు వినియోగించేవారు సైబర్ నేరగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండి, అనవసరపు లింకులు ఓపెన్ చేయరాదనీ, ఫోన్లకు వచ్చిన మెసేజులు, ఓటీపీలు ఇతరులకు షేర్ చేయరాదన్నారు. అలాగే గ్రామంలో ఎవరైనా అపరిచిత వ్యక్తుల పట్ల అనుమానం ఉన్నా వెంటనే పోలీసు వారి డయల్ 100కి కాల్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. పల్లెల్లో, గ్రామాల్లో బాల్య వివాహలకు ఎవరైనా సహకరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని, 1981 డయాల్ చేయాలన్నారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మహేందర్, రజిత, గ్రామస్తులు,వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.