– ఇందిరమ్మ రాజ్యం అంటూ ఎమర్జెన్సీని తలపిస్తున్న రేవంత్ పాలన
– హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితేల సతీష్ కుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బిఆర్ఎస్ లో ఉన్నట్టా.. కాంగ్రెస్ పార్టీలో చేరినట్టా స్పష్టం చేస్తూ అరికెపూడి దమ్ముంటే గులాబీ కండువా వేసుకొమ్మని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన ప్రతిసారి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఏదో ఒక హైడ్రామాకు తెరలిపి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని ఆరోపించారు. విపక్ష పార్టీ ఎమ్మెల్యే పై దాడి చేయించిన సీఎం, నేడు శాంతి భద్రతల పేరెత్తడం విడ్డూరంగా ఉందన్నారు. రుణ మాఫీ పై, వరదలపై ప్రశ్నిస్తే ప్రజల దృష్టిని మరల్చేందుకు సరికొత్త నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు మీటింగ్ పెట్టుకునే హక్కు లేదా అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ నేతలు అంటే ముఖ్యమంత్రికి ఎందుకు అంత వణుకు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు చేయడం, అదుపులోకి తీసుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ ఆనాటి ఎమర్జెన్సీ రోజులను రేవంత్ అమలు చేస్తున్నారని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి నివాసం పై దాడి చేసిన అరికెపూడి గాంధీ అనుచరులను, కాంగ్రెస్ గుండాలను కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడం కాదు అరెస్టు చేయాలని దుయ్యబట్టారు. విద్వేషాలను రెచ్చగొట్టవద్దని రాష్ట్ర డిజిపి ఏకపక్షంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్పడం చూస్తుంటే ఎమర్జెన్సీని తలపించేలా కనిపిస్తోందన్నారు. డీజీపీ ఏకపక్షంగా మాట్లాడినట్టు కనిపించిందన్నారు. దాడికి పాల్పడింది కాంగ్రెస్ పార్టీ నాయకులు అరికెపూడి గాంధీ అనుచరులైతే వార్నింగ్ మాత్రం బిఆర్ఎస్ నేతలకు ఇస్తారా.. ఇది హాస్యాస్పదంగా ఉందన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే విపక్ష ప్రజాప్రతినిధులపై దాడులకు తెగబడుతున్నారని, తెలంగాణ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ప్రవర్తిస్తామంటే బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోబోదన్నారు. తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు.