
ఈనెల 14వ తారీఖు ఆదివారం నిర్వహించనున్న శ్రీ గోదా దేవి రంగనాథుల కల్యాణానికి రావాల్సిందిగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి హైదరాబాద్ ఆయన నివాసంలో ఆహ్వాన పత్రికను మంగళవారం ఆలయ కార్యనిర్వాహణ అధికారి సల్వాది మోహన్ బాబు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొమ్మారెడ్డి నరేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ కొత్త వెంకటేశం ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.