– ఆందోళనలో రైతులు
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి పంట ఎదిగే సమయంలో కలుపు మొక్కలు రైతులను ఇబ్బంది పెడుతోంది. వర్షం ఏకధాటిగా పడు తుండడంతో కలుపుతీత పనులు కొనసాగించే ఆవకాశం లేదు.పత్తి గడ్డి రోజురోజుకూ పెరుగుతోంది. వరుస వర్షాలతో కూలీలు కూడా దొరకని పరిస్థితి. దీనికి తోడు పంటచేలలో వర్షపునీరు నిలిచి మొక్కలు ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి.
ప్రధాన పంటగా పత్తి..
మండలంలో ప్రధాన పంటగా పత్తి సాగు చేస్తున్నారు.మండలంలో 3,000 వేల ఎకరాల్లో సాగవుతోంది. రైతులు సాగు చేసిన పత్తి అక్టోబర్ లో దిగుబడి ప్రారంభం అవుతుంది. చేతికోచ్చే వరకు నాలుగు నెలలు రైతులు పంటను కాపాడు కోవాల్సి ఉంటుంది. పత్తి సాగుకు ఒక ఎకరానికి పెట్టుబడి కోసం రైతులు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చు పెడుతారు. ప్రస్తుతం సాగు చేసిన పత్తి దాదాపుగా 45 రోజుల మాత్రమే అవుతుంది. గత పది రోజులుగా ఎడతెరిపి లేకుం డా వర్షం కురుస్తుండడంతో విపరీతంగా కలుపు పెరిగింది. దీంతో పత్తి మొక్కలు ఎదగడం లేదు. ఎకరానికి 10 మందికి పైగా కూలీలు అవసరమవు తారు. కూలీలకు రోజుకు రూ.500 చొప్పున కూలీ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. రైతులకు ఎకరానికి రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు అదనంగా
రానున్న రోజుల్లో తెగుళ్లు సోకే అవకాశం..
ఇప్పుడే ఇలా ఉంటే పూత, కాత దశలో మరింత తెగుళ్లు సోకితే ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. కాగా మండలంలో అధికశాతం నల్లరేగడి,ఎర్రరిగడి భూములు కావడంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షా లతో పంటచేలలో తేమ, వర్షపునీరు వారం రోజుల వరకు ఆరే పరిస్థితి లేదు. లోతట్టు పంట చేలలో నీరు నిలిచి పంట పంట సైతం దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కలుపు పెరుగుతుంది: రైతు మాధప్ప వార్ సంఘం పటేల్ వడ్లం
పది రోజుల నుంచి వర్షం కురుస్తోంది ప్రతిరోజు వర్షం కురవడంతో పంట చెలలో పనులు చేసుకోలేని పరిస్థితి. తేమ శాతం ఉండి బురద ఉండడంతో ఆరకతో పనులు సాగడం లేదు. పత్తిలో కలుపు విపరీతంగా పెరిగింది.
జాగ్రత్తలు పాటించాలి: ఏవో నదిముద్దీన్
రైతులు పంటలను కాపాడేందుకు జాగ్రత్తలు పాటించాలి.వరుస వర్షాలతో కలుపు తీసే అవకాశం లేకపోవడంతో మొక్కలు ఏపుగా పెరిగాయి.మందులు పిచికారీ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.సాగులో సమస్యలు ఉంటే ఏఈఓ లను సంప్రదించాలి.