నియోజకవర్గ కేంద్రంమైన ముధోల్ వార సంత 2024-2025 సంవత్సరానికి గాను బుధవారం వారపు సంత వేలంపాటను మేజర్ పంచాయతీ ఈఓ ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో బహిరంగ వేలం నిర్వహించగా గ్రామానికి చెందిన బి. సాయినాథ్ రూ.91,000 దక్కించుకున్నట్లు ఆయన ప్రకటించారు .ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ అనూష, మాజీ ఎంపీటీసీ దేవోజీ భూమేష్, మాజీ ఉపసర్పంచ్ సంజీవ్, మాజీ వార్డ్ సభ్యులు,గ్రామస్థులు , పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.