వారం రోజుల హుండీ ఆదాయం ఒక కోటి 46 లక్షలు..

నవతెలంగాణ-వేములవాడ : వేములవాడ శ్రీ  రాజరాజేశ్వర స్వామి వారి హుండీల లెక్కింపు బుధవారం ఆలయ ఓపెన్ స్లాబ్ లో నిర్వహించగా 7 రోజులకు గాను 1కోటి,46లక్షల, 79వేల,830రూపాయల నగదు, బంగారం 054గ్రాముల, 150 మిల్లి గ్రాములు,వెండి 09కిలోల,100గ్రాములు, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణాధికారి డి. కృష్ణ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ హుండీల లెక్కింపు కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఆలయ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో పాటు భ్రమరాంబిక సేవ సమితి సభ్యులు  పాల్గొన్నారు. ఎస్పీఎఫ్ పోలీస్ సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహించారు.