వెయ్ దరువెయ్ రిలీజ్‌కి రెడీ

వెయ్ దరువెయ్ రిలీజ్‌కి రెడీసాయిరామ్‌ శంకర్‌, యషా శివకుమార్‌, హెబ్బా పటేల్‌ హీరో, హీరోయిన్లుగా సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ మీద దేవరాజు పొత్తూరు నిర్మించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో వస్తున్న ఈ మూవీకి కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం బాధ్యతల్ని నవీన్‌ రెడ్డి నిర్వర్తిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ,’ కేవీఆర్‌ మాట్లాడితే నేరుగా గుండెకు తాకుతోంది. ఇంత తక్కువ టైంలో నిర్మాత దేవరాజ్‌, దర్శకుడు నవీన్‌ రెడ్డి ఈ సినిమాను గొప్పగా తీశారు. సాయి రామ్‌ శంకర్‌ నాకు బ్రదర్‌లాంటి వాడు. అతని ఫుల్‌ ఎనర్జీ ని ఈ చిత్రంలో చూడబోతున్నారు. ఈ సినిమాలోని పాట లు, లిరిక్స్‌ బాగున్నాయి. భీమ్స్‌ మంచి పాటలే కాదు.. మంచి మాట లు కూడా మాట్లాడతాడని తెలిసింది. ఈ సినిమాలో కామారెడ్డి నుంచి హీరో వస్తాడు. కానీ కామారెడ్డి నుంచి హీరోలే వస్తారని కేవీఆర్‌ నిరూపించారు. ఈనెల 15న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్‌ చేయాలి’ అని అన్నారు.
‘తక్కువ డబ్బుతో ఎక్కువ ఆనందాన్ని సినిమా ఇస్తుంది. సినిమా అనేది వ్యసనం కాదు. హరీష్‌, మాలా శ్రీ ప్రేమ ఖైదీ సినిమా కోసం ఆడిషన్స్‌కి వెళ్లాను. ప్రభాస్‌ శ్రీను, సత్యం రాజేష్‌ వంటి హాస్యనటులంటే నాకు చాలా ఇష్టం. ఒక సినిమా హిట్టయితే ఎన్నో కుటుంబాల్లో సంతోషం నిండు తుంది. వచ్చిన సక్సెస్‌ను కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది’ అని కామారెడ్డి ఎమ్మెల్యే కేవీ రమణా రెడ్డి తెలిపారు.
నిర్మాత దేవరాజ్‌ మాట్లాడుతూ, ‘ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. సినిమా కచ్చితంగా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. డైరెక్టర్‌ నవీన్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘మా ఈవెంట్‌కు గెస్టుగా వచ్చిన హరీష్‌ శంకర్‌కి, కేవీఆర్‌కి థ్యాంక్స్‌. కథ చెప్పిన వెంటనే నిర్మాత దేవరాజ్‌ ఓకే చెప్పారు. సాయి రామ్‌ శంకర్‌ మా చిత్రానికి ఎంతో కష్టపడ్డారు. ఈనెల 15న ఈ మూవీ రాబోతోంది. ఆడియెన్స్‌ అంతా మా సినిమాను చూడండి’ అని అన్నారు.
సాయి రామ్‌ శంకర్‌ మాట్లాడుతూ, ‘కమర్షియల్‌గా తీసిన ఈ సినిమాకు భీమ్స్‌ మంచి పాటలు, ఆర్‌ఆర్‌ ఇచ్చారు. ఈ సినిమాలో ప్రభాస్‌ శ్రీను అన్నకి మంచి పాత్ర దొరికింది. సత్యం రాజేష్‌ను మేం బాగా ఇబ్బంది పెట్టాం (నవ్వుతూ). మా నిర్మాతకు సినిమాలంటే ప్యాషన్‌. ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించారు. బంపర్‌ ఆఫర్‌, అమ్మనాన్న ఓ తమిళమ్మాయి లాంటి ఎమోషన్స్‌తో ఈ సినిమా ఉంటుంది. చాలా తక్కువ టైంలో ఈ సినిమాను దర్శకుడు అద్భుతంగా తీశారు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్‌. మార్చి 15న మా సినిమా రాబోతోంది.’ అని చెప్పారు.