ఫిడె 45వ చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం సాధించిన భారత జట్టులో కీలక ఆటగాడు, తెలంగాణ స్టార్ అర్జున్ ఇరిగేశికి హైదరాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అర్జున్‌కు రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షులు ప్రసాద్, శాట్ అధికారులు నందకిశోర్ గోకుల్ , అలెగ్జాండర్ ఫ్రాన్సిస్, సురేశ్ కాలేరు సహా చెస్ క్రీడాకారులు, క్రీడాభిమానులు తదితరులు అపూర్వ స్వాగతం పలికారు.