నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యుత్ ఘాతం తో వెల్డర్ మృతి చెందాడు. మృతుడు చాపర్ల మురళి( 32) సతీమణి నందిని పిర్యాదు మేరకు ఎస్.ఐ శివరాం క్రిష్ణ తెలిపిన వివరాలు. మండలంలోని గుమ్మడి వల్లి పంచాయితీ కొత్తూరు కు చెందిన చాపర్ల మురళి స్థానికంగా వెల్డర్ గా పనిచేస్తూ ఎలక్ట్రికల్ మరమ్మత్తులు చేస్తుంటాడు. క్రమంలో పంచాయితీ కి చెందిన మోటార్ మరమ్మత్తులకు గురవ్వడంతో ఆ పనులు చేస్తుండగా విద్యుత్ ఘాతానికి గురయ్యాడు.హుటాహుటిన అశ్వారావుపేట లోని ఓ ఆస్పత్రి కి తరలించారు.అయినా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ.ఐ తెలిపారు.