నవతెలంగాణ – రాయపర్తి
అధికారులు.. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇల్లు పథకాల సర్వేను క్షేత్రస్థాయిలో చేపట్టి అర్హులకు సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఉపోద్ఘాటించారు. మంగళవారం మండలంలోని గన్నారం గ్రామంలో చేపడుతున్న సర్వే తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు ఇంటింటి సర్వేను పకడ్బందీగా చేపట్టాలి అన్నారు. చేపడుతున్న నాలుగు పథకాల సర్వేలను సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. సర్వేపై అధికారులు ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలుపాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించాలి అన్నారు. గ్రామ సభల్లో స్థానిక ప్రజలకు వచ్చే సందేహాలకు నివృత్తి చేసి సర్వేను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ తో పాటుజిల్లా ప్రజా పరిషత్ కార్యనిర్వహణ అధికారి రామ్ రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ నాగమణి, తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్, ఎంపిఓ ప్రకాష్, పీఆర్ ఏఈ శ్రీప్రియ, గ్రామ పంచాయతీ కార్యదర్శి కరుణశ్రీ, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.