అర్హులకు సంక్షేమ ఫలాలు చేరాలి…

Welfare benefits should reach the deserving...నవతెలంగాణ –  భీంగల్ రూరల్
ఈ రోజు భీంగల్ మండలంలో ప్రజా పాలన గ్రామసభలు నిర్వహించడం జరిగింది. భీంగల్ మండలంలోని పల్లికొండా, లింగపూర్, గోన్ గోప్పుల, చెంగల్, సంతోష్ నగర్ తండా, పీకే తండా, దేవక్కపేట్, తాళ్లపల్లి తండా అర్హులకు సంక్షేమ ఫలాలు చేరాలి. ప్రజా పాలన కార్యక్రమం ద్వారా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు చేకూరేలా చూస్తామని ఎంపిడిఓ గంగుల సంతోష్ కుమార్ అన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల జాబితా, రేషన్ కార్డుల జాబితా, గ్రామ సభ లలో ప్రజల సమక్షంలో లబ్ధిదారుల లిస్టులను చదవడం జరిగింది. అట్టి జాబితాకు ఆమోదం పొందనైనది. ఈ సందర్భంగా ఎంపీడీవో సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ఇంకా ఎవరికి అయిన పైన తెలిపిన స్కీం లలో జాబితాలో పేరు రాని వారు ఉన్నట్లయితే వారికి ప్రత్యేక కౌంటర్ ద్వారా దరఖాస్తులు కూడా స్వీకరించడం జరిగిందని ఎంపీడీవో సంతోష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎంపిడిఓ గంగుల సంతోష్ కుమార్త,హసీల్దార్ షబీర్, ఎంపీఓ జావేద్ అలి, DT లు శ్రీనివాస్, అశ్విన్ supt భీమ్ రావు, వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు, పంచాయితీ కార్యదర్శులు,తదితరులు పాల్గొన్నారు.