నవతెలంగాణ- నవీపేట్: సంక్షేమ హాస్టళ్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఆదుకోవాలని ఎస్ ఎఫ్ ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిపి యాత్రలో భాగంగా స్థానిక భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి బుధవారం హాస్టలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోడ అనిల్ మాట్లాడుతూ ఆర్మూర్ నవీపేట్ జిపి యాత్రలో భాగంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్సీ బీసీ వసతి గృహాలను సందర్శించగా వర్షాల వల్ల వసతి గృహాలు శిథిలావస్థలోకి చేరాయని, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు నిద్రమత్తుని వీడి తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలని లేనియెడల భవిష్యత్తులో ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు జిపి సిబ్బంది సమ్మెకు సంఘీభావం తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాచకొండ విగ్నేష్, నాగరాజు, మహేష్ దీపిక, జవహర్, సాయికుమార్, సంధ్యారెడ్డి, అరవింద్, శివ, బాబురావు తదితరులు పాల్గొన్నారు.