ప్రతి ఇంటికి సంక్షేమం ప్రతి ముఖంలో సంతోషం: ఆలూర్ శ్రీనివాస్ రెడ్డి

నవతెలంగాణ- ఆర్మూర్    

ప్రతి ఇంటికి సంక్షేమం ప్రతి మొఖంలో సంతోషం ఇదే మా విధానం, ఇదే మా నినాదం.ఆర్మూర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు ఆలూరు శ్రీనివాస్ రెడ్డి అన్నారు..

ఆలూర్ మండల కేంద్రములో బుధవారం గ్రామ పంచాయితీ ఆవరణలో నూతనంగా మంజూరైన బీడీ టేకేదారుల పింఛన్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సంధర్బంగా పింఛన్లు అందుకున్న వారు మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల్లో బీడీ పరిశ్రమ గురించి, బీడీ కార్మికుల గురించి, టేకేదార్ల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు మన కెసిఆర్ గారు ఒక్కరే అని గుర్తు చేసుకున్నారు. కొత్తగా పించన్ ప్రకటించి నేడు అందించిన సందర్భంగా కెసిఆర్ ,  ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ దుమ్మజి శ్రీనివాస్ , గ్రామ బీఆర్ఎస్అధ్యక్షులు రెగుల్ల రజనీకాంత్, వెల్మ గంగారెడ్డి , బార్ల సంతోష్, గ్రామస్థులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు .