సబ్బండ వర్గాల సంక్షేమం బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం

– ప్రచారం ప్రారంభించిన ఎంపీ ప్రభాకర్‌ రెడ్డి
నవతెలంగాణ- దుబ్బాక
సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే సబ్బండ వర్గాల సంక్షేమం సాధ్యమని మెదక్‌ ఎంపీ, బీఆర్‌ఎస్‌ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. శనివారం దుబ్బాక పురపాలిక పరిధిలోని ఒకటో వార్డులో రేకులకుంట మల్లికార్జున దేవస్థానంలో ఎంపీ ప్రభాకర్‌ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఓనమాలు దిద్దిన దుబ్బాక ప్రాంతం నుంచి పోటీ చేస్తున్న తనని ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మోసకారి రఘునందన్‌ రావును నమ్మొద్దని, ప్రశ్నిం చేవారు కాదు పనిచేసే వారు కావాలని స్పష్టం చేశారు. పనిచేస్తున్న కేసీఆర్‌ సర్కార్‌ను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం పురపాలిక పరిధిలోని చెల్లాపూర్‌, దుంపలపల్లి వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు .కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గన్నె వనిత భూమిరెడ్డి, వైస్‌ చైర్‌పర్సన్‌ అధికం సుగుణ బాలకిషన్‌ గౌడ్‌, కౌన్సిలర్లు నిమ్మ రజిత, గోనెపల్లి దేవలక్ష్మి సంజీవరెడ్డి ఇల్లందుల శ్రీనివాస్‌, బత్తుల స్వామి, దుబ్బాక బాలకష్ణ గౌడ్‌, ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్‌ రెడ్డి, జెడ్పిటిసి కడ్తాల రవీందర్‌ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్‌ నమిలె భాస్కరా చారి, పిఎసిఎస్‌ చైర్మన్‌ శేర్ల కైలాష్‌, ఏఎంసి చైర్‌ పర్సన్‌ చింతల జ్యోతి కష్ణ, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, భూంపల్లి మనోహర్‌ రావు, కోమటిరెడ్డి రజనీకాంత్‌ రెడ్డి, తీపిరెడ్డి మహేష్‌ రెడ్డి, పండరి రాజా లక్ష్మణరావు, నందాల శ్రీకాంత్‌ పాల్గొన్నారు.