కార్మికుల సంక్షేమం బీఆర్ఎస్ తోనే సాధ్యం

  • బీఆర్ఎస్ కెవి నియోజకవర్గ బాధ్యులు గౌడిచర్ల సత్యనారాయణ గౌడ్

నవతెలంగాణ తుంగతుర్తి: కార్మికుల సంక్షేమం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని బీఆర్ఎస్ కేవీ నియోజకవర్గ బాధ్యులు గౌడిచర్ల సత్యనారాయణ గౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ కేవీ మండల ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించి మాట్లాడారు. నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ కుమార్ గెలుపు కోసం కార్మికులంతా ఐక్యంగ ఉండి కష్టపడి పనిచేయాలని, అదేవిధంగా ఈనెల 29న జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు అధిక సంఖ్యలో కార్మికులు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు గడ్డం సోమేష్, కూరపాటి సోమేష్ ,భవన నిర్మాణ మండలాధ్యక్షులు బొంకురి శ్రీను, ప్రధాన కార్యదర్శి కె. వెంకన్న కుంభం మహేష్, చిత్తలూరి రాజేష్, గుడిపాటి సైదులు, వెంకన్న, పోలేపాక రాజేష్ గణేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.