సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

ప్రభుత్వం ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
నవతెలంగాణ-మియాపూర్‌
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రభుత్వం విప్‌, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కొండాపూర్‌, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్‌, మియాపూర్‌, హఫీజ్‌పేట్‌, చందానగర్‌, భారతీ నగర్‌(పార్ట్‌) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం ద్వారా మంజూరైన 173 మంది లబ్దిదారులకు మియా పూర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్‌ యాదవ్‌, ఉప్పలపాటి శ్రీకాంత్‌, నార్నె శ్రీనివాసరావు, మంజులరెడ్డితో కలిసి చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం అమలు చేసి, నిరుపేదలకు అండగా నిలుస్తుం దన్నారు. అర్హులందరూ సంక్షేమ పథకాలను సద్విని యోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రఘుపతిరెడ్డి, మోహన్‌గౌడ్‌, లక్ష్మినారాయణగౌడ్‌, బీఆర్‌ఎస్‌ చందానగర్‌ డివిజన్‌ అధ్యక్షులు రఘునాథ్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ హఫీజ్‌పేట్‌ డివిజన్‌ అధ్యక్షులు గౌతమ్‌గౌడ్‌, ఆ పార్టీ గచ్చిబౌలి డివిజన్‌ అధ్యక్షులు రాజు నాయక్‌, హఫీజ్పెట్‌ డివిజన్‌ గౌరవ అధ్యక్షులు వాలా హరీశ్‌రావు, పార్టీ నాయ కులు కర్ణాకర్‌గౌడ్‌, శ్రీనుపటేల్‌, లక్షారెడ్డి, మిద్దెల మల్లారెడ్డి, జనార్ధన్‌ రెడ్డి, సత్యనారాయణ, రఘునాథ్‌, దామోదర్‌, రాంచందర్‌ రెడ్డి, వజిర్‌, జనార్ధన్‌, బాబుమోహన్‌ మల్లేష్‌, నరేందర్‌ బల్లా, ప్రవీణ్‌, గోపాల్‌ యాదవ్‌, అశోక్‌ సాగర్‌, రాథోడ్‌, శివ, మాధవి, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.