– ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్
కొనసాగుతున్న బీఆర్‌ఎస్‌లో చేరికలు
నవతెలంగాణ-ఆమనగల్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి అందుతున్నాయని కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్ యాదవ్ అన్నారు. మండలంలోని చెన్నంపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కండువాలతో వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మాలెపల్లి గ్రామానికి చెందిన 20 మందికి పైగా ఆయా పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరినట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జక్కు అనంత్ రెడ్డి, నాయకులు సయ్యద్ ఖలీల్, కోట శ్రీను తదితరులు పాల్గొన్నారు.