పదేళ్లుగా ప్రజలకు రేషన్ కార్డులు,ఇండ్లు అందించలేని బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు మానుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాలని..అర్హులందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేస్తుందని యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అజ్జు యాదవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.బుధవారం మండల పరిధిలోని చెర్ల అంకిరెడ్డిపల్లి,అనంతసాగర్ గ్రామాలలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో అజ్జు యాదవ్ పాల్గొన్నారు.అర్హులు అందోళన చెందకుండా సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం పారదర్శకంగా అర్హుల గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయనుందని అజ్జు యాదవ్ తెలిపారు.