– అపోహలు నమ్మవద్దు: ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
నవతెలంగాణ – గోవిందరావుపేట
నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. జిల్లాలో ఎలాంటి వ్యతిరేకత లేదు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలను నిజమైన లబ్ధిదారులకు అందజేస్తామని, లబ్ధిదారుల ఎంపికపై వస్తున్న అపోహలను నమ్మవద్దని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. గురువారం మండలం లోని పస్ర గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజా పాలన గ్రామసభ లో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామసభలలో స్వీకరించిన దరఖాస్తులు కానీ గతంలో ఇచ్చిన దరఖాస్తులను పరిగణ ల్లోకి తీసుకొని తొలి జాబితాలు ప్రకటించడం జరుగుతుందని, పూర్తి పరిశీలన అనంతరమే తుది జాబితా ప్రకటించడం జరుగుతుందని అన్నారు. వివిధ పథకాలకు అర్హులైన లబ్ధిదారులు ఇప్పుడే కాకుండా ఏప్పటికైనా దరఖాస్తు చేసుకోవచ్చని, ఆయా పథకాలకు అర్హత ఉన్న లబ్ధిదారులను కచ్చితంగా గుర్తించి అందజేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని, నిజమేనా అర్హులను గుర్తించిన అనంతరమే గ్రామ సభలలో పేర్లను ప్రకటించడం జరుగుతుందని స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడానికి పలు గ్రామాలకు చెందిన ప్రజలు జిల్లా మండల కార్యాలయల చుట్టూ తిరిగేవారని, నేడు గ్రామాలలోనే అధికారుల సమక్షంలో లబ్ధిదారులు ఎంపిక చేయడం గ్రామీణ ప్రజలకు ఎంతోగాను ఉపయోగపడుతుందని అన్నారు. ప్రభుత్వ పథకాలు రాని పక్షంలో అర్హులైన ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రతిరోజు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాలపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతున్నాయని, పలు పథకాలను లబ్ధి పొందని అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జోహార్ రెడ్డి, తాహసిల్దార్ సృజన్ మరియు ఆయా శాఖల సంబంధిత అధికారులు పాల్గొన్నారు.