
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, నిరంతర ప్రక్రియ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆదివారం, యాదగిరిగుట్ట మండలం సైదాపూరం మొదటి విడతగా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలను ప్రజాపాలన గ్రామ సభ ధ్వారా ఉత్తర్వులను ఆయన అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. సైదాపూర్ గ్రామంలో రైతు భరోసా 918 , ఇందిరమ్మ ఇల్లు 172 , రేషన్ కార్డ్స్ 91, ఆత్మీయ భీమా 28, లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్యని వారి సొంత గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత ట్రాక్టర్ నడుపుతూ గ్రామ పంచాయతీ వద్ద కు చేరుకుని సమావేశంలో పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ రాజకీయ అవకాశం కల్పించిన నా సొంత గ్రామంలో ఈ పథకాలను అమలు చేసుకొని చివరి లబ్ధిదారుల వరకు పథకాలను అందించే ఆవకాశం కలగడం చాలా సంతోషమన్నారు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, నిరంతర ప్రక్రియ అన్నారు. ఆలేరు నియోజకవర్గంలో 120 చెరువులు నింపితే రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రజా పాలనలో సంక్షేమం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోదామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బీర్ల శంకర్, మండల నాయకులు దుంబాల వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, మండల పార్టీ అధ్యక్షులు కానుగు బాలరాజు గౌడ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.