
నవతెలంగాణ – మల్హర్ రావు
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేయబోతున్న నాలుగు సంక్షేమ పథకాలు అందుతాయని, ఎ వరు ఆందోళన చెందవద్దని మండల ఎంపిడిఓ శ్యాంసుందర్, తాజా మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు అన్నారు. శుక్రవారం మండలంలోని పెద్దతుండ్ల గ్రామపంచాయతీ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభ నిర్వహించారు.రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,ఇందిరమ్మ ఇల్లు,నూతన రేషన్ కార్డులు తదితర పథకాలపై అవగాహన నిర్వహించి, అర్హులైన వారి జాబితాను వెల్లడించారు. అర్హుల పేర్లు జాబితాలో రాకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎపిఓ గిరి హరీష్, కార్యదర్శి పెంచాల సతీష్,ఇన్చార్జ్ ఆర్ఐ నరేష్, ఏఈఓ శిరీష,కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు జక్కల వెంకటస్వామి యాదవ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు,ప్రజలు పాల్గొన్నారు.