– జిల్లా నాయకులు బోనపల్లి రఘుపతి రెడ్డి
నవతెలంగాణ – శాయంపేట : కాంగ్రెస్ హయాంలోనే నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని కాంగ్రెస్ జిల్లా నాయకులు బోనపల్లి రఘుపతి రెడ్డి అన్నారు. మండలంలోని ప్రగతిసింగారం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి 55వ జన్మదిన వేడుకలను శుక్రవారం రాత్రి జిల్లా నాయకులు బోనపల్లి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టగానే అమలు చేశారని గుర్తు చేశారు. అతి త్వరలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు వైద్యుల ఆదిరెడ్డి, పి ఎ సి ఎస్ డైరెక్టర్ ఎలమంచి జయపాల్ రెడ్డి, నాయకులు మోరే రాజయ్య, శ్రీను, కూరాకుల రాజు, పోలేపల్లి అశోక్, వైద్యుల వెంకట్ రెడ్డి, రవి, సందీప్ రెడ్డి, రాజిరెడ్డి, కట్టన్న, సంజీవయ్య, తదితరులు పాల్గొన్నారు.