రుణాలు చెల్లించని వారికి సంక్షేమ పథకాలు నిలిపివేయాలి

Welfare schemes should be stopped for defaultersనవతెలంగాణ – భిక్కనూర్
మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాలు, బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలు చెల్లించని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేయాలని శుక్రవారం మండల సమైక్య ఆధ్వర్యంలో అధ్యక్షులు రాజమణి తాసిల్దార్ శివప్రసాద్, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు మాట్లాడుతూ మండలంలోని మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాలు కొన్ని గ్రామాలలో గత నాలుగు సంవత్సరాల నుండి చెల్లించడం లేదని, 15 రోజుల నుండి  మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో 15 మంది కమిటీ సభ్యులు కలిసి బకాయి డబ్బులు చెల్లించని గ్రామాలలో రికవరీ కొరకు వెళ్లడం జరుగుతుందని లోన్లు తీసుకున్న లబ్ధిదారులు బకాయి చెల్లించకుండా ఇబ్బందులు చేస్తున్నారని తెలిపారు. రుణాలు తీసుకొని వాయిదాలు చెల్లించని వారికి మహిళా శక్తి కార్యక్రమంలో మహిళలకు సంక్షేమ పథకాలు నిలిపివేయాలని వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం శ్రీనివాస్, మహిళా సంఘం సభ్యులు, తదితరులు ఉన్నారు.