
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కే.రమేష్ కుమార్ సూచించారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా గురువారం దుబ్బాక పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహ చౌరస్తా వద్ద ‘సాంస్కృతిక సారథి టీం’ లీడర్ జాగోరే రవి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న 6 గ్యారంటీలను పాటల ద్వారా వివరించారు. ఈ కళా ప్రదర్శనలో కళాకారులు రవీందర్, క్రాంతి కుమార్, ఎల్లయ్య, భార్గవి, తిరు మలయ్య, శ్యాంసుందర్, కనకయ్య, ప్రకా ష్, హరిప్రసాద్, బిక్షపతి పాల్గొన్నారు