
– గ్రామ పంచాయితీల వారిగా క్లస్టర్ ఇన్చార్జీల నియామకం
నవతెలంగాణ -తాడ్వాయి
ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక ఎలక్షన్లో గెలుపుకు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లి దేవేందర్ అన్నారు. మంగళవారం మండలంలోని కాటాపూర్ బెల్ట్ లోని 6 గ్రామపంచాయతీలలో మంత్రి సీతక్క ఆదేశాల మేరకు విస్తృతంగా పర్యటించారు. ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామపంచాయతీ క్లస్టర్ల వారిగా ఇన్చార్జిలను ఎన్నుకున్నారు. నర్సాపూర్, అంకంపల్లి, పంభాపూర్ గ్రామపంచాయతీల క్లస్టర్ ఇంచార్జీలు మంకిడి నరసయ్య, ఇరుప వెంకటేశ్వర్లు పట్టం కన్నయ్య మంకిడి సంతోష్ రాజారాం, ఎర్రయ్య, కాంతారావు, సందీప్, కుమార్, సురేష్, రామస్వామి, రవీందర్, స్వామి వెంకటేష్, కృష్ణ లు
బీరెల్లి రంగాపూర్ క్లస్టర్ ఇన్చార్జిలుగా బెజ్జూర్ శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, కాయితే లింగ చారి, స్వామి, సురేష్, శివ కృష్ణారావు, రమేష్, సూర్యకాంత్, ముత్తయ్య ఇప్ప లక్ష్మి, కాటాపూర్, దామెరవాయి క్లస్టర్ ఇన్చార్జిలుగా పుల్లూరు చిరంజీవి, బాబు సత్యం సంతోష్ సతీష్ కిషోర్ నరేష్ రెహమాన్ లక్ష్మణ్ చిరంజీవి నరసింహులు రంజిత్ వెంకన్న తదితర ఇంకా కొంతమంది చురుకైన కార్యకర్తలను ఇన్చార్జిగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మేడారం డ్రెస్ కూడా చైర్మన్ అర్రెం లంచ్ పటేల్, పాక సాంబయ్య, ముజఫర్, అశ్విని సూర్యనారాయణ, నరసింహస్వామి, ఇరుసడ్ల నారాయణ, పులి రవి రాములు కల్తి నారాయణ, పల్నాటి సత్యం కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.