దేశంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు ఆవుతున్నాయి

నవతెలంగాణ- తొగుట : దేశంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రం లో అమలు ఆవుతున్నాయని సర్పంచ్ దామరంచ ప్రతాప్ రెడ్డి  అన్నారు. మంగళవారం మల్లన్నసాగర్ ముంపు గ్రామం, ఆర్ అండ్ ఆర్ కాలనీ ఏటీగడ్డ కిష్టాపూర్ గ్రామంలో వివిధ కుల సంఘాలతో ప్రత్యే క సమావేశం ఏర్పాటు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కు మరోసారి ఓటు వేసి మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవా లని సూచించారు. దళితుల కుటుంబాలకు కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేశారన్నారు. భారతదేశం లోని లేనటువంటి సంక్షేమ పథకాలు మన తెలం గాణలో ప్రవేశపెట్టాడ గొప్ప విషయం అన్నారు.
ఇందులో దళిత బంధు వంటి పథకాలను ప్రవేశ పెట్టడం, ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ కార్పొరేషన్ ద్వారా దళితులకు మేలు కలుగుతుందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు మన కేసీఆర్ జీవనం పోశారని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం కుల సంఘాల సభ్యులు మాట్లాడుతూ మన  అందరం ఏకమై భారీ మెజార్టీతో గెలిపించుకోవాల ని అన్నారు. సర్పంచ్ నాయకత్వంలో పని చేస్తా మని, ఆయన ఎవరికి ఓటు వేయమంటే వారికి ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కుల సంఘ పెద్దలు లింగం, రాజు, కనకయ్య, అంజయ్య, నాంపల్లి, కుల సంఘం సభ్యు లు తదితరులు పాల్గొన్నారు.