హైదరాబాద్ : టెక్సటైల్స్‌కు సంబంధించిన అంతర్జాతీయ తయారీదారు వెల్‌స్పన్ లివింగ్ లిమిటెడ్ తాజాగా క్వీర్ ఐకి చెందిన జెరెమియా బ్రెంట్‌తో నూతన భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించింది. తద్వారా టెక్సటైల్ ఫర్నిషింగ్స్ కలెక్షన్ ఆవిష్కరించనున్నట్లు పేర్కొంది. ఈ ఉత్పత్తుల్లో పడక గదులు, స్నానపు సూట్ తదితర ఉత్పత్తుల శ్రేణీని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. న్యూయార్క్ నగరంలో వచ్చే సెప్టెంబర్ 16-19న జరుగబోయే హోమ్ ఫ్యాషన్ ప్రొడక్ట్స్ అసోసియేషన్ (హెచ్‌ఎఫ్‌పిఎ) ఉత్పత్తి శ్రేణీని ఆవిష్కరించనున్నట్లు వెల్లడించింది.