రష్యన్‌ మిలిటరీ గురించి పశ్చిమ దేశాల ‘ఆందోళన’

రష్యన్‌ మిలిటరీ గురించి పశ్చిమ దేశాల 'ఆందోళన'– సీనియర్‌ అమెరికన్‌ దౌత్యవేత్త
రష్యా సైన్యం అత్యంత వేగంగా ”పునర్‌నిర్మించబడటం” గురించి అమెరికా చాలా ఆందోళన చెందుతోంది. దీనికి కారణం చైనాతో మాస్కో కున్న ”బలమైన” స్నేహ సంబంధం అని అమెరికా భావిస్తున్నట్టు అమెరికన్‌ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ కర్ట్‌ కాంప్‌బెల్‌ చెప్పాడు. యకార్నెగీ ఎండోమెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ అనే వాషింగ్టన్‌కు చెందిన థింక్‌ ట్యాంక్‌ బుధవారం నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో ఉక్రెయిన్‌ వివాదం గురించి చర్చిస్తూ క్యాంప్‌బెల్‌ ఇలా పేర్కొన్నాడు: ”గత రెండేండ్లుగా మనం చూస్తున్నది ఒక వేగవంతమైన, ద్రుఢ సంకల్పంతో జరుగుతున్న రష్యా సైన్యం పునర్నిర్మాణం. ఇది పశ్చిమ దేశాలకు నిజమైన ఆందోళన కలిగించే అంశం” అని అతను ఒప్పుకున్నాడు.
కీవ్‌కు సైనిక సామర్థ్యాలను అందించడంలో అమెరికా చాలా జాగ్రత్తగా ఉందా అని క్యాంప్‌బెల్‌ను అడిగినప్పుడు ఆయన అమెరికా ”ఉక్రెయిన్‌కు చాలా పెద్ద సహాయాన్ని అందించేది” అని ప్రతిస్పందించాడు. రష్యాలో సైనిక ఉత్పత్తిని పెంచడానికి విదేశీ సహాయం, ముఖ్యంగా చైనాతో సహకారం కారణంగా అని ఆ దౌత్యవేత్త పేర్కొన్నాడు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం ఏ స్థాయిలో సన్నిహితంగా ఉందనే విషయాన్ని విదేశాంగ శాఖ తక్కువగా అంచనా వేసిందని క్యాంప్‌బెల్‌ పేర్కొన్నాడు. బీజింగ్‌, మాస్కో మధ్య సంబంధం ”బహుశా ప్రపంచవ్యాప్తంగా అత్యంత బలీయమైన, ముఖ్యమైన ద్వైపాక్షిక సంబంధమని మనం గమనించాలి. అందుకు తగిన విధంగా ప్రతిస్పందించాలి” అని ఆయన వాదించాడు.
ఉక్రెయిన్‌ సంఘర్షణను పరిష్కరించడానికి రష్యాతో దౌత్యపరమైన సంపర్కం తక్షణం అవసరమని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయని, అయితే అందుకు అమెరికాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నట్టు కాంప్‌బెల్‌ పేర్కొన్నాడు. ”అటువంటి స్థితిలో మేము కోల్పోయేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన అనుభవాన్ని మరెక్కడా పునరావతం చేయాలనే ఆలోచన నుంచి రష్యా లేదా చైనా దూరంగా వచ్చేంత వరకు ఇటువంటి ఫలితాలను మేము అంగీకరించలేము” అని డిప్యూటీ సెక్రటరీ చెప్పాడు. ఉక్రెయిన్‌ను దాని సైనిక బలంపై పరిమితులతో కూడిన తటస్థ దేశంగా మార్చడం, కీవ్‌ ద్వారా జాతి రష్యన్‌లపై వివక్షాపూరిత విధానాలను తిప్పికొట్టడం, రాడికల్‌ ఉక్రేనియన్‌ జాతీయవాదులను అధికార స్థానాల నుంచి తొలగించడం మాస్కో లక్ష్యాలుగా ఉన్నాయి. అంతేకాకుండా రష్యా ఐదు ఉక్రేనియన్‌ ప్రాంతాలపై సార్వభౌమాధికారాన్ని వదులుకోవాలని డిమాండ్‌ చేస్తోంది.