ఉక్రెయిన్‌లో పాశ్చాత్య దళాలు

Western forces in Ukraine– పోరాడుతున్నాయనేది ఒక బహిరంగ రహస్యం – పోలాండ్‌
ఉక్రెయిన్‌లో పాశ్చాత్య దళాలు పోరాడుతున్నాయనే విషయం ఇప్పుడు బహిరంగ రహస్యం అని పోలిష్‌ విదేశాంగ మంత్రి రాడోస్లావ్‌ సికోర్స్కీ జర్మన్‌ ప్రెస్‌ ఏజెన్సీ డీపీఏకి చెప్పాడు. ఉక్రెయిన్‌లో నాటో దళాలను మోహరించడమనేది అనూహ్యమైనది కాదు. అటువంటి ఆలోచనను తోసిపుచ్చనందుకు ఫ్రెంచ్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ను అభినందిస్తున్నట్లు రాడోస్లావ్‌ సికోర్స్కీ చెప్పాడు. బుధవారం డీపీఏ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, సికోర్స్కీ ఇలా పేర్కొన్నాడు, మీ ఛాన్సలర్‌ ఓలాఫ్‌ స్కోల్జ్‌ చెప్పినట్లు, ఉక్రెయిన్‌లో ప్రధాన దేశాల నుండిఇప్పటికే కొంతమంది సైనికులు ఉన్నారు. గత నెలలో ఒక ప్రెస్‌ మీటింగ్‌ సందర్భంగా, స్కోల్జ్‌ ఉక్రెయిన్‌కు టారస్‌ క్రూయిజ్‌ క్షిపణుల పంపిణీని తిరస్కరించడాన్ని సమర్థించాడు.తమ సైనికులను ఉక్రెయిన్‌ పంపి అక్కడ జరుగుతున్న యుద్ధంలో జర్మనీ పాల్గొనదని ఛాన్సలర్‌ ఓలాఫ్‌ స్కోల్జ్‌ చెప్పాడు. బ్రిటిష్‌, ఫ్రెంచ్‌ సైనికులు చేస్తున్న లక్ష్య నియంత్రణ, దానితో పాటు లక్ష్య నిర్వహణలను జర్మనీ చేయజాలదు అని ఛాన్సలర్‌ ఆ సమయంలో విలేకరులతో అన్నాడు. జర్మన్‌ చాన్సలర్‌ చెప్పిన మాటలుఉక్రెయిన్‌లో పాశ్చాత్య సైనికుల ఉనికిని ధవీకరిస్తున్నట్లు విస్తతంగా మీడియా వ్యాఖ్యానించింది. స్కోల్జ్‌ అలావెల్లడించటం సమస్య కాదా అని డీపీఏ అడిగినప్పుడు, సికోర్స్కీ ఇలా ప్రతిస్పందించాడు. పోలిష్‌లో, అందరికీ తెలిసిన రహస్యాన్ని వివరించే టాజెమ్నికా పోలిస్జినెల అనే వ్యక్తీకరణ మాకు ఉంది. చారిత్రక కారణాలను చూపుతూ వార్సా ఉక్రెయిన్‌కు సైనికులను పంపదని సికోర్స్కీ పునరుద్ఘాటించాడు. అయితే, ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఉక్రెయిన్‌కు సైన్యాన్ని పంపటం అనే ఎంపికను కొట్టివేయకపోవటాన్ని పోలిష్‌ దౌత్యవేత్త స్వాగతించాడు.
”ఉక్రెయిన్‌కు సహాయం చేయడానికి అమెరికా నేతత్వంలోని నాటో సైనిక కూటమి నుండి సైనికులను పంపే అవకాశాన్ని తాను మినహాయించలేను” అని ఫిబ్రవరి చివరలో మాక్రాన్‌ చెప్పాడు. ఈ ప్రకటనకు వ్యతిరేకంగా నాటో సభ్య దేశాల నాయకుల నుండి తిరస్కరణలు వెల్లువెత్తాయి. ఉక్రెయిన్‌లో తమతమ దేశాల సైనిక దళాలను మోహరించే ప్రసక్తే లేదని వివిధ దేశాల అధినేతలు ప్రకటించారు. అయినప్పటికీ ఉక్రెయిన్‌కు మద్దతునిచ్చే విషయంలో పారిస్‌ ఎటువంటి పరిమితులను గుర్తించదని మక్రాన్‌ ప్రకటించాడు. ”రష్యాను జయించటానికి మునుపటి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, ఇప్పుడు అటువంటి ప్రయత్నాలవల్ల సంభవించే పర్యవసానాలుఅత్యంత విషాదకరంగా ఉంటాయి” అని రష్యా ఫెడరల్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నాడు.