తడి సామాజిక తనిఖీ ప్రజావేదిక..

Wet Social Inspection Public Forum..– రూ.29.693 వేలు జరిమానా
నవతెలంగాణ – మల్హర్ రావు
: మండలంలో ఉపాధి హామీ పథకం కింద ఏప్రిల్ 1,2023 నుంచి మార్చి 31,2024 ఆర్థిక సంవత్సరం మండలంలో చేసిన సిసి రోడ్లు,కిచెన్ సేడ్స్,మురికి కాల్వలు, పూడికతీత,మట్టి రోడ్లు,వన నర్సరీలు,మొక్కలు నాటడం తదితర పనులకు సంబంధించిన రూ.7,27,87,063 కోట్ల పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదికను గురువారం తాడిచెర్ల మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలలో చేసిన పనులపై ఆడిట్ బృందం వారం పాటు ప్రత్యక్షంగా తనిఖీ చేసి రికార్డులను చూడడం, అవ కతవకలను గుర్తించారు. ఆ అవకతవకలను ప్రజా వేదికలో చదివి వినిపించగా బాధ్యులపై క్రమశిక్షణలలో బాగంగా సిబ్బందికి పెనాల్టీ, రికవరీ రూపేనా రూ.29.693 వేలు జరిమానాను ప్రజా వేదిక డిఆర్డీఓ అధికారి నరేశ్ విధించారు. ఈ సందర్భంగా ప్రిసైడింగ్ గ్ అధికారి మాట్లాడుతూ.. సామాజిక తనిఖీలో వచ్చిన అభియోగాలపై సిబ్బందికి త్వరలో జిల్లా కార్యాలయం నుంచి షోకాజు నోటీసులు జారీ చేసి అనంతరం శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా విజిలెన్స్ అధికారి మంజుల, క్వాలిటీ కంట్రోల్ అధికారి కె ధరమ్ సింగ్, అంబడ్స్ మెన్ ఆర్. శ్రీనివాస్, ఏ. వీంద్రనాథ్, ఎంపీడీఓ శ్యాంసుందర్ ఉపాధి హామీ ఎపిఓ హరీష్, టెక్నికల్ అసిస్టెంట్లు, పం చాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.