నవతెలంగాణ-డిచ్ పల్లి
వామ్మో మార్కెట్లో టమాట ధర 200 మార్కును పాటిండి గ్రామీణ ప్రాంతాల్లో పండే ఈ టమాటా ధర 180 నుండి 200 వరకు పలుకుతుంది అదే పట్టణాల్లో పరిస్థితి మరి దారుణంగా ఉంటుందని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లనే ఈ ధరలు మండుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గాను టమాట వేసిన రైతు నష్టపోయి టమాట లేకుండా అయిపోయింది. కొందరి వద్ద కోద్దో గోప్పో ఉన్న టమాటా ధరకు ఆకాశాన్ని అంటుతున్నాయి మార్కెట్లోకి వెళితే కూరగాయలు కుండ్లిని పరిస్థితి దాపురించిందని ఇలాగే కొనసాగితే పేదలు నిరుపేదలు కూరగాయలు తిని పరిస్థితులు లేదని ఇలాంటి ఆకుకూరలు తీసుకున్న 100 రూపాయలకు తగ్గకుండా ఉంటున్నాయని వారన్నారు ఎప్పుడు లేని విధంగా ఈసారి టమాటా ధర 200 మార్పు దాటితే కిలో కొనుగోలు చేసేవారు 50 రూపాయలకు వచ్చే పౌకిలో తనే సరిపుచ్చుకుంటున్నారు. ఇంకా రాబోవు రోజుల్లో వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు సైతం మిగిలి ఉన్న రైతులకు కష్టాలు తెచ్చి పెడుతున్నాయని పలువురు రైతులు పేర్కొంటున్నారు టమాట పెరగడానికి కారణం అధిక వర్షాలేనని, ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి వచ్చే టమాట కూడా మార్కెట్లోకి రాకపోవడంతో మార్కెట్లో ఉన్న కొందరి వద్దనే ఈ ధరలు ఏమంతంగా పెరిగిపోతున్నాయని వారన్నారు. ప్రభుత్వం పాలకొల్లు స్పందించి కూరగాయలు టమాటాల ధరలను అదుపులో పెట్టే విధంగా చర్యలు చేపట్టాలని పేదలు నిరుపేదలు కోరుతున్నారు.