ఈ మధ్య కాలంలో పుట్టినరోజు వేడుకల్లో విద్యార్థులు కొట్టుకోవడం, డ్రగ్స్ వాడకం, శుభాకాంక్షలు తెలపకపోవడంతో ప్రెండ్‌ని చంపేస్తుండటం వంటి సంఘటనలు మన సమాజంలో పెరుగుతున్న మానసిక, సామాజిక సమస్యలకు అద్దం పడుతున్నాయి. దీన్ని వివరణాత్మకంగా విశ్లేషించడం ద్వారా, సమస్యను లోతుగా అర్థం చేసుకోవచ్చు.
1. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లోపం
విద్యార్థుల్లో భావోద్వేగాలను చక్కగా గుర్తించడం, అర్థం చేసుకోవడం, నియంత్రించడం మౌలికంగా అభివద్ధి చెందకపోవడం వంటివి కారణాలు.
చిన్న విషయాలపైకే ఆవేశపడటం, పరస్పర సంబంధాల ప్రాధాన్యతను గుర్తించకపోవడం, సమస్యలను సామరస్యంగా పరిష్కరించలేకపోవడం వంటివి కారణాలు. ఈ లోపం వారి ప్రవర్తనలో హింసాత్మక రూపం దాల్చే అవకాశం కల్పిస్తుంది.
2. సామాజిక- కుటుంబ ప్రభావం
తల్లిదండ్రుల దష్టి లోపం : పిల్లలతో మానసికంగా సన్నిహితంగా ఉండడం కంటే, వారి భౌతిక అవసరాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరుగుతోంది.
స్నేహితుల ప్రభావం: సమూహం నుండి గుర్తింపు పొందడం కోసం విద్యార్థులు అవాంఛిత చర్యలకూ దారితీస్తారు.
సంస్కతి, విలువల మార్పు : గౌరవం, శ్రద్ధ, పరస్పర సహకారం వంటి విలువల బోధన కొరత కనిపిస్తోంది.
3. డ్రగ్స్ వాడకం
విద్యార్థులు డ్రగ్స్ వైపు ఆకర్షితులు కావడానికి కొన్ని ప్రధాన కారణాలు :
8 జిజ్ఞాస , ఒత్తిడి నుంచి ఉపశమనం కోరడం, సమూహంలో ప్రాధాన్యం పొందాలని కోరుకోవడం వంటి వాటితో పాటు ఈ పదార్థాలు తాత్కాలిక ఆనందాన్నిస్తాయని నమ్మడం.
8 డ్రగ్స్ మానసిక స్థితిని మరింత అశాంతిగా చేసి, హింసాత్మక ప్రవర్తనకు ప్రేరేపించవచ్చు.
4. పరస్పర గౌరవం తగ్గిపోవడం
8నేటి సాంకేతిక యుగంలో, సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం వల్ల విద్యార్థులు వ్యక్తిగత సంబంధాల పట్ల ఆత్మీయత కోల్పోతున్నారు.
8శుభాకాంక్షలు తెలిపే చిన్న విషయానికి కూడా ప్రతిస్పందన అసహనం, ఆగ్రహం వంటి భావాలతో ఉంటుంది. ఇది స్వీయ గౌరవం తక్కువగా ఉన్న వ్యక్తుల లక్షణం.
5. ఆత్మగౌరవం, గౌరవం-కోరిక
శుభాకాంక్షలు తెలపకపోవడం వంటి చిన్న విషయాలకు కూడా, కొంతమంది ఈగో సమస్యగా భావించి పెద్ద గొడవలకు దిగుతారు. తమను తక్కువగా చూసినట్లు అనిపించడం లేదా అవమానించబడినట్లు భావించడం హింసాత్మక చర్యలకు కారణమవుతుంది.
6. చిన్న విషయాలకు హింసకు దారితీసే మానసిక ధోరణి
హింసను సమస్య పరిష్కార సాధనంగా భావించడం, మానసిక స్థిరత్వం లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి ప్రవర్తన వారి చిన్ననాటి అనుభవాలు లేదా కుటుంబ పరిస్థితే ప్రధాన కారణం కావచ్చు.
ఈ సమస్యలను పరిష్కారాన్ని సమాజంలోని ప్రతి వ్యక్తి బాధ్యత తీసుకోవాలి. పిల్లల ప్రవర్తన మార్చడం మాత్రమే కాకుండా, వారికి సరైన దిశ చూపడం, వారి వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడం కోసం ప్రతి ఒక్కరూ కషి చేయాలి. ”పిల్లలు మంచి గా ఉంటే, ప్రపంచం మంచిగా ఉంటుంది” అనే భావనతో ముందుకు సాగడం అవసరం.
సమస్య పరిష్కారం కోసం విపులమైన దారులు
కుటుంబ స్థాయిలో :
1. విలువలపై శ్రద్ధ – పిల్లలకు శాంతి, సహనమూ, పరస్పర గౌరవం నేర్పడం.వారి భావోద్వేగాలను గమనిస్తూ, అవసరమైనప్పుడు స్నేహపూర్వకంగా మార్గనిర్దేశం చేయడం.
2. పిల్లలతో వ్యక్తిగత సంబంధం – రోజులో కనీసం కొన్ని నిమిషాలు పిల్లలతో మాట్లాడటం. వారి సమస్యలను వింటూ, నిశ్చింతను కల్పించడం.
విద్యాసంస్థల స్థాయిలో :
1. సోషియో-ఎమోషనల్ లెర్నింగ్ (ూజుూ) – విద్యార్థులలో భావోద్వేగాలను గుర్తించడం, అర్థం చేసుకోవడం, సమర్థవంతంగా వ్యక్తపరచడం నేర్పించే ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేయాలి.
2. స్నేహబంధాల ప్రాధాన్యతపై అవగాహన – స్నేహితుల మధ్య పరస్పర సహకారం, సానుకూల సంభాషణపై అవగాహన కల్పించడం.
3. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించే పద్ధతులు – చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించే శిక్షణ (జశీఅటశ్రీఱష్ =వరశీశ్రీబ్‌ఱశీఅ ుతీaఱఅఱఅస్త్ర).
4. డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలు – విద్యార్థులకు డ్రగ్స్ కారణంగా వచ్చే మానసిక, శారీరక నష్టాలను వివరించడం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ సమస్యపై నిఘా పెట్టడం.
సామాజిక స్థాయిలో :
1. న్యాయ రక్షణ : డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం.
విద్యార్థులకు చట్టపరమైన అవగాహన కల్పించడం.
2. జాగతిని పెంచే కార్యక్రమాలు : హెల్త్ క్యాంప్స్, సైకాలజికల్ కౌన్సెలింగ్, యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లు. స్నేహితులు, కుటుంబ సభ్యుల అనుభవాలను పంచుకోవడం ద్వారా విద్యార్థులలో అవగాహన కల్పించడం.
3. పాజిటివ్ రోల్స్ మోడల్స్ : ప్రేరణ కలిగించే వ్యక్తుల జీవిత చరిత్రలను తెలియజేసే సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించడం.
తాత్కాలిక మానసిక సహాయం :
1. విద్యార్థుల మాటలను దయతో వింటూ, వారికి అవసరమైన సహాయం అందించడం.
2. హింసాత్మక ప్రవర్తన చేసే విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్ అందించడం.
3. పుట్టినరోజు వేడుకల వంటి సందర్భాల్లో వినోదంతోపాటు సామాజిక స్పహ పెంచే చర్చలు చేయడం.
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్,
హిప్నో థెరపిస్ట్