ఉత్తర్వులు సరే.. పెరిగిన వేతనాలు ఏవి?

Orders OK.. What are the increased wages?– అప్గ్రేడ్ అయిన అంగన్వాడీ లకు పెంచిన వేతనాలు ఇవ్వాలి…
– జిల్లా నాయకురాలు జి.పద్మ‌
నవతెలంగాణ – అశ్వారావుపేట
అంగన్వాడి టీచర్స్ మరియు హెల్పర్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని అప్ గ్రేడ్ అయిన మినీ టీచర్స్ కు పూర్తి వేతనం ఇవ్వాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని  శ్రీకాంత్ కు అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జి.పద్మ మాట్లాడుతూ.. అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మినీ టీచర్స్ ని అప్ గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినప్పటికి పూర్తి వేతనం ఇవ్వకుండా పాత పద్ధతిలోనే మినీ టీచర్స్ కి ఇస్తున్నట్లు గానే వేతనాలు వేయటం దుర్మార్గమని అన్నారు. 10 నెలలు గడుస్తున్నా కూడా అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు ఏవి పరిష్కరించ బడలేదని,నేటి నుండి దశలవారీగా ఉద్యమ నిర్వహిస్తామని ఎమ్మెల్యేల ఇల్లు వద్ద ధర్నా కలెక్టరేట్ల ధర్నాలు కమిషనరేట్ లో ధర్నాలకు పిలుపిస్తున్నట్లు తెలిపారు. గ్రాట్యుటీ చట్ట ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని,పెండింగ్ టీఏడీఏ ఇవ్వాలని,సెంటర్స్ లో స్టేషనరీ అన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు, యూనియన్ నాయకులు పిట్టల అర్జున్,రాధా,కృష్ణవేణి, రాజేశ్వరి,లక్ష్మి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.