– భువనగిరి బీజేపీ పార్లమెంటు అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్
– రూ.2లక్షల రుణమాఫీ విధి విధానాల ఖరారేదీ
– రైతుబంధు కొందరికే వచ్చింది
– వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఏదీ
– ఇబ్రహీంపట్నంలో రైతు సత్యాగ్రహ దీక్ష
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
వంద రోజుల కాంగ్రెస్ పాలన పూర్తయిన ఆరు గ్యా రంటీల అమలు అటకెక్కిందని బీజేపీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ విమర్శించారు. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ నాయకులు పాప య్యగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య యాదవ్‌తో కలిసి పాల్గొన్నారు. దీక్షలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత శాసనసభ ఎన్నికల ముందు చేసిన రైతు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అధికారం చేపట్టిన వెంటనే రూ.2లక్షల రుణమాఫీని చేస్తామని చెప్పిన ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తయినా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించా రు. ఇంకా విధివిధానాలు రూపొందించకపోవ డం రైతులను మోసపుచ్చడమేనన్నారు. మరోవైపు కరువు విలయతాండవం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి పట్టనట్లు గా ఉందన్నారు. పంట నష్టం అంచనా వేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎకరానికి రూ.25వేల నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యాన్ని కింటాలుకు రూజ500 బోనస్ ఇస్తామన్న ప్ర భుత్వం ఇంకా ఉలుకు పలుకు లేకుండా వ్యవహరిస్తుంద న్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్తు అందిస్తామని రైతులను మోసం చేసిందన్నారు. విద్యుత్ కోత, కరువు కటకాలతో రైతాంగం దివాలా తీస్తోందని ఆందోళన వె లుగుచ్చారు. కౌలు రైతులకు రూ.12,500 ఆర్థిక సహా యం చేస్తామని ఇచ్చిన హామీ ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. ధరణిని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పి న మాట మరిచిందన్నారు. ఎకరాకు రూ.15వేల రైతు బంధు ఇస్తామని చేసిన వాగ్దానం మరిచి, కోతలు విధి స్తుందన్నారు. రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తూ రైతుబంధుపై మాట మార్చిందని విమర్శించారు. అం దుకనే రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కిసా న్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు సత్యాగ్రహ దీక్షలు చేపట్టామని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభు త్వం దిగిరాకపోతే రైతాంగ ఉద్యమానికి పూనుకుంటా మని హెచ్చరించారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు జక్కా రవీందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కిసాన్ మోర్చా జాతీయ నాయకులు పాపయ్యగౌడ్, జిల్లా అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డి, కొప్పు భాష, పోరెడ్డి నర్సింహారెడ్డి, అర్జున్‌రెడ్డి, ధన్నె భాషయ్య, బోసు పల్లి ప్రతాప్, లచ్చిరెడ్డి, అశోక్‌గౌడ్, ముత్యాల భాస్కర్ తదితరులు ఉన్నారు.