నవతెలంగాణ – రెంజల్
తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకాన్ని రైతు భరోసా గా మార్చిన ప్రభుత్వం రైతు బంధు పథకం ప రైతుల సలహాలు సూచనలను స్వీకరించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి లక్ష్మీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం రెంజల్ మండలం ధూపల్లి రైతు వేదికలో సింగిల్ విండో చైర్మన్ శేషు గారి భూమారెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రైతుల సలహాలు సూచనలను తెలుసుకొని సంబంధిత అధికారులకు నివేదిక అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు కాశం సాయిలు, ధనుర్ గంగాధర్, చిట్టి, గంగారం, సీఈఓ జీవన్ రెడ్డి, రైతులు బాబన్న, గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.