బీసీ కులాలకు కావాల్సింది తాయిలాలు కాదు రాజ్యాధికారం

– బీసీల ఐక్యవేదిక
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
బీసీ కులాలకు కావాల్సింది తాయిలాలు కాదు రాజ్యాధికారం కావాలని ఐక్యవేదిక నాయకులు డిమాండ్‌ చేశారు. బీసీల ఐక్యవేదిక సమావేశం కొండాపూర్‌లోని ఒంగురు శ్రీనివాస్‌ యాదవ్‌ కార్యాలయంలో నిర్వహిం చారు. బేరి రామచందర్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో బీసీల ఐక్యత, బీసీ భవిష్య ప్రణాళిక గురించి హాజరైన బీసీలు చర్చల్లో పాల్గొని అభిప్రాయాలను తెలిపారు. బీసీ ఐక్యవే దిక చైర్మన్‌ బేరి రామచందర్‌ యాదవ్‌ రాష్ట్ర బీసీ సంఘం ఉపాధ్యక్షులు మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం బీసీలు ఉద్యమం చేయవలసిన సమయం ఆసన్నమైందని, అందుకు 15 మంది ముఖ్య కార్యకర్తలతో ఒక కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రణాళిక అధికారమే అంతి మ లక్ష్యం మన 54 శాతం బీసీలకు ఐక్యవేదిక బలోపే తం చేసి ముందుకు పోదామని స్పష్టం చేశారు. బీసీలు పార్టీలో ఉన్నా బీసీ సమాజానికి సేవ చేయాలని, కమిటీ సభ్యులు వచ్చే సమావేశంలో అందరూ బీసీలను ఏకం చేసి సంఘంలో చర్చిస్తూ ముందుకు తీసుకొని రావాలని పిలుపునిచ్చారు ఎన్నికల కంటే ముందు భారీ ఎత్తున 10 వేల బీసీ జనంతో సమావేశం ఏర్పాటు చేద్దామని విద్యా, వైద్యం విషయంలో బీసీలకు తోడ్పాటు అందించి ఆదర్శం గా ఉందామని నాయకులకు కార్యకర్తలకు సూచించారు. పోలీస్‌ స్టేషన్‌ల్లో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో బీసీలకు సహాయం చేద్దామని కోరారు. కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్‌, నర్సింలు ముదిరాజ్‌ శేరిలింగంపల్లి అధ్యక్షులు రమే ష, మల్లేష్‌ యాదవ్‌, మియాపూర్‌ నరసింహ ముదిరాజ్‌, కుమార్‌ యాదవ్‌, మహిళా అధ్యక్షురాలు సరోజినమ్మ కార్యదర్శి వెంకటమ్మ, బీసీ ఫెడరేషన్‌ అధ్యక్షులు ఆర్కే సాయన్న, గౌస్‌ భారు, వెంకట్‌ అరవింద్‌ కెవిఆర్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.